తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!!
- October 02, 2024
హైదరాబాద్: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గురువారం ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!