ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు..5 నెలలగా తిండే లేదట !
- October 02, 2024ఇరాక్: ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు...తాజాగా తెర పైకి వచ్చాయి.నాలుగు, ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదట యజమాన్యం.దీంతో పని మానేశారు ముగ్గురు కార్మికులు. దీంతో భోజనం పెట్టవద్దని కంపెనీ యజమాని మెస్ కు హుకుం జారీ చేశారు. ఈ తరుణంలోనే... తిండి లేక రూమ్ లోనే ఉంటున్నారు ముగ్గురు కార్మికులు. అయితే.. వీరి కష్టాల నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
ఈ ఫిర్యాదు అందగానే... ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఆ యజమానిని పిలిపించింది భారత రాయబార కార్యాలయం.అయితే... ఎంబసీకి ఫిర్యాదు చేశారని ముగ్గురు తెలంగాణ కార్మిలకుల పై యజమాని దాడి చేశాడట. అటు 20 రోజుల క్రితం ఈ ముగ్గురు పై దాడి చేసి బలవంతంగా పనిలోకి పంపాడు యజమాని. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన హరీష్, నిజామాబాద్ జిల్లా కి చెందిన రాజన్న లు ఐదు నెలలుగా ఇరాక్ లో తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు ఒక్కొక్కరు 2,50,000 చెల్లించారట. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిథి)
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!