జపాన్‌లో పేలిన వరల్డ్ వార్-2 బాంబ్!
- October 03, 2024
జపాన్: జపాన్‌లోని మియాజాకీ విమానాశ్రయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన బాంబు ఒకటి పేలింది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం నాటిదిగా అధికారులు గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ పాతిపెట్టిన బాంబు, ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది.
పేలుడు సమయంలో అక్కడ విమానాలేవీ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే గొయ్యి కారణంగా దాదాపు 80కిపైగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. సమాచారం అందుకున్న సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. 500 పౌండ్ల బరువైన బాంబు పేలినట్లు నిర్ధారించారు. 1943లో మియాజాకి ఎయిర్‌పోర్టును నిర్మించారు.
మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫైట్ ట్రైనింగ్ ఫీల్డ్‌గా దీన్ని వాడేవారు. ఆత్మాహుతి దాడిమిషన్లో భాగంగా కొందరు పైలట్లు ఇక్కడి నుంచే బయల్దేరేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం ఇక్కడ జాడవిరిచిన కొన్ని బాంబుల్లో పేలనివి ఈ ప్రాంతంలో భాగర్భంలో ఉండిపోయాయి. భూమి కిందిపొరల్లో ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు ఇవి పేలుతుంటాయి అని రక్షణ అధికారులు తెలిపారు. ఇలాంటి ఎన్నో బాంబులు జపాన్ చుట్టూ అగ్రరాజ్యం పాతిపెట్టిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







