అక్టోబర్ 10న ‘తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్’ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్..!!

- October 03, 2024 , by Maagulf
అక్టోబర్ 10న ‘తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్’ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్..!!

కువైట్: తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్ (TEF) కువైట్ నిర్వహించే 15వ సాంకేతిక ఆవిష్కరణల సదస్సు & ప్రదర్శన (TICE).. క్రౌన్ ప్లాజా ఫర్వానియాలోని అల్-బరాకా బాల్ రూమ్‌లో అక్టోబర్ 10న ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 50 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్‌పిసి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం నుండి పెద్దసంఖ్యలో ఔత్సాహికులు హాజరుకానున్నారు.   తమిళనాడు IOFS కమిషనర్ తిరు బి.కృష్ణమూర్తి గౌరవ అతిథిగా హాజరవుతారు.కాన్ఫరెన్స్, ఎక్స్‌పోకు హాజరు కావడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కింది లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. https://www.cognitoforms.com/TEFKUWAIT1/RegistrationForThe15thTICE8thEEA

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com