యూఏఈలో 9 రోజులపాటు సెలవులు.. వెకేషన్ ప్లాన్ కు పెరుగుతున్న డిమాండ్..!!

- October 03, 2024 , by Maagulf
యూఏఈలో 9 రోజులపాటు సెలవులు.. వెకేషన్ ప్లాన్ కు పెరుగుతున్న డిమాండ్..!!

యూఏఈ: యూఏఈలో ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబరు 14 నుండి 18 వరకు లేదా అక్టోబర్ 21 నుండి 25 వరకు వారం రోజుల విరామం లభించనుంది. హాఫ్-టర్మ్ బ్రేక్‌లు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారుతూ ఉంటాయి.  “అక్టోబర్ నాటికి యూఏఈలో వాతావరణం మెరుగుపడుతుంది. ఇది స్టేకేషన్‌ల డిమాండ్‌లో 15- నుండి 20 శాతం పెరుగుదలకు దారి తీస్తుంది. చిన్న విరామ సమయంలో విదేశాలకు వెళ్లే బదులు, ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు దేశంలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. స్థానికంగా బస చేయడానికి ఇష్టపడుతున్నారు.’’ అని musafir.com COO రహీష్ బాబు తెలిపారు. దుబాయ్ పామ్ ప్రాంతాలు, అబుదాబి యాస్ ఐలాండ్, రస్ అల్ ఖైమా ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఉన్నాయని పేర్కొన్నారు. హాఫ్ టర్మ్ డిమాండ్‌తో పాటు డిసెంబర్‌లో జాతీయ దినోత్సవ సెలవులకు బుకింగ్‌లు కూడా వస్తున్నాయని బాబు తెలిపారు. చాలామంది ప్రయాణ సమస్యలను నివారించడానికి వీసా-రహిత లేదా వీసా-రాక గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారని, ప్రముఖ ఎంపికలలో బ్యాంకాక్, CIS దేశాలు, మాల్దీవులు ఉన్నాయని వెల్లడించారు. డిమాండ్ నేపథ్యంలో డిసెంబరులో 15 నుండి 20 శాతం ధర పెరుగుదల ఉండే అవకాశం ఉంటుందని bnbme హాలిడే హోమ్స్ CEO వినాయక్ మహ్తాని తెలిపారు.  మారుతున్న సీజన్‌తో వచ్చే ఏడాది ఈస్టర్ వరకు రేట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. “స్టేకేషన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త ట్రెండ్ ప్రకారం ఎక్కువ మంది వ్యక్తులు ఇప్పుడు ఫ్రైడే డీల్స్‌పై కూడా ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది అతిథులు శుక్రవారం నుండి శనివారం వరకు ఉండి ఆదివారం సాయంత్రం తిరిగి రావడానికి ఇష్టపడతారు.’’ అని TravelzMind LLC మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ అన్నంద్ అభిప్రాయపడ్డారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com