‘ఇండియన్ 3’ అప్డేట్.! ఇది నిజమేనా.?

- October 03, 2024 , by Maagulf
‘ఇండియన్ 3’ అప్డేట్.! ఇది నిజమేనా.?

ఇటీవల భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇండియన్ 2’ ఫలితం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఇండియన్ 2’ తర్వాత మూడో పార్ట్ కూడా వుండబోతోందనీ అప్పుడే లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అంతేకాదు, ‘ఇండియన్ 2’ ప్రమోషన్లలోనే ఈ సినిమా కన్నా ‘ఇండియన్ 3’ ఇంకా బాగుంటుందని కమల్ హాసన్ చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి కూడా తెలిసిందే.

అయితే, ఆ సంగతి అటుంచితే.. ‘ఇండియన్ 3’ విషయంలో ఓ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాని ఓటీటీ బేస్ చేసుకుని రూపొందిస్తున్నారట. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ‘ఇండియన్ 2’ విషయంలో నిర్మాతలు దారుణంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆయా పరిస్థితుల్ని దృష్టిలో వుంచుకుని ఎటువంటి రిస్క్ చేయకుండా ‘ఇండియన్ 3’ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com