రానున్న వర్షాకాలం సన్నాహాల పై సమీక్ష..!!
- October 04, 2024
కువైట్: రాబోయే వర్షాకాల పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పబ్లిక్ వర్క్స్ మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో డా. అల్-మషాన్ సమావేశం అయ్యారు. ఫీల్డ్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని, చెరువులను పటిష్ట పరిచే చర్యలు చేపట్టామని, భారీ వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటాయని వెల్లడించారు. మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, నీటి మురుగు పైపులు మూసుకుపోకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఉండాలని ఆమె నివాసితులను కోరారు. ఈ సమావేశంలో జియాలజిస్టుల బృందం, రక్షణ, అంతర్గత, పౌర రక్షణ, నేషనల్ గార్డ్స్, కువైట్ ఫైర్ ఫోర్స్, కువైట్ మున్సిపాలిటీ, పౌర విమానయాన అథారిటీ, విద్యుత్, నీరు, విద్య, కువైట్ ఆయిల్ కంపెనీ, మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







