$132 బిలియన్లతో 171 దేశాలలో సేవా కార్యక్రమాలు.. సౌదీ అరేబియా

- October 03, 2024 , by Maagulf
$132 బిలియన్లతో 171 దేశాలలో సేవా కార్యక్రమాలు.. సౌదీ అరేబియా

రియాద్:  ప్రధాన మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ నేతృత్వంలోని యెమెన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం, రియాద్‌లోని కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్‌రీలీఫ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. పర్యటన సందర్భంగా యెమెన్ ప్రధానికి 1996 నుండి 2024 వరకు మానవతా సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. మొత్తం $132 బిలియన్ల విలువ మానవతా సాయంతో 171 దేశాలకు ప్రయోజనం జరిగిందన్నారు.  ఇందులో $27 బిలియన్లు యెమెన్ ప్రజల కోసం ప్రత్యేకంగా అందించినట్లు పేర్కొన్నారు. అహ్మద్ అవద్ రాయల్ కోర్ట్ సలహాదారు, KSrelief సూపర్‌వైజర్ జనరల్ డాక్టర్. అబ్దుల్లా అల్-రబీహ్, సెంటర్ అధికారుల బృందం వివరాలను అందించారు.  యెమెన్‌లోని అణగారిన, పీడిత కమ్యూనిటీల దుస్థితిని తగ్గించడానికి KSrelief నిబద్ధతను డాక్టర్ అల్ రబీహ్ స్పష్టం చేశారు. ఈ సహాయం రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా గొప్ప మానవతా తత్వానికి అద్దం పడుతుందని వారు పేర్కొన్నారు.  KSrelief నేతృత్వంలో 102 దేశాలలో $7 బిలియన్ల విలువైన 3,068 ప్రాజెక్ట్‌లను చేపట్టినట్టు, ఇందులో మహిళల కోసం 479, పిల్లల కోసం 478 కార్యక్రమాలు ఉన్నాయన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com