13న అలయ్ బలయ్.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
- October 04, 2024
హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 13న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంతో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరు ఒకే వేదికపైకి వస్తారు. కాగా ఈ అలయ్ బలయ్ లో అన్న రకాల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వంటలు వడ్డిస్తారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. సీఎం లు చంద్రబాబు, రేవంత్రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







