యూఏఈ VAT చట్టంలో సవరణలు..కొత్త పన్ను మినహాయింపులు ఇవే..!!

- October 06, 2024 , by Maagulf
యూఏఈ VAT చట్టంలో సవరణలు..కొత్త పన్ను మినహాయింపులు ఇవే..!!

యూఏఈ: విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టంలోని కొన్ని నిబంధనలను యూఏఈ క్యాబినెట్ సవరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త సవరణలలో మూడు సేవలపై పన్ను మినహాయింపులను ఇచ్చారు. పెట్టుబడి నిధి నిర్వహణ సేవలు, వర్చువల్ ఆస్తులకు సంబంధించిన కొన్ని సేవలు, స్వచ్ఛంద సంస్థ- ప్రభుత్వ సంస్థల మధ్య విరాళాలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు.  ఇంతకుముందు ఈ సేవలపై 5 శాతం పన్ను విధించారు. యూఏఈలో పన్ను వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, పన్ను రాబడిని సేకరించడం, పెట్టుబడి వాతావరణాన్ని పెంచడం, దేశానికి మరిన్ని వ్యాపారాలు పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో నిరంతర ప్రయత్నాలలో ఈ మార్పులు భాగమని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ యూనిస్ హాజీ అల్ ఖూరి తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com