భారతీయుడికి మరణశిక్ష విధించిన కువైట్ ప్రభుత్వం
- June 21, 2016
ఓ హత్య కేసులో చిక్కుకున్న భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. అంతేకాక బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లు(కేడీ) పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. 3 వేల కేడీల రుణం విషయంలో ఓ ఆఫ్గాన్, భారత వలసదారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారతీయుడు ఆఫ్గాన్ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారైన అతడిని స్పాన్సర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక బాధితుడి వారసులకు 5001 కేడీలు ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







