TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- October 07, 2024
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అక్టోబర్ 6వ తేదీ ఆదివారంనాడు తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 550 మందికి పైగా పేదలకు ఉచితంగా వైద్యసేవలందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ రెగ్యులర్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తానా ఫౌండేషన్ ఈ క్యాంప్ నిర్వహణకు సహకరించడం ఇది 8వ సారి. ఈ వైద్యశిబిరానికి డాక్టర్ ప్రసాద్ నల్లూరి స్పాన్సరుగా వ్యవహరించారు.
తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ వల్లేపల్లి శశికాంత్ ఈ క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. ఈ క్యాంప్ కు గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న మురికివాడల నుంచి దాదాపు 550 మంది పేదలు హాజరై వైద్య చికిత్సను చేయించుకున్నారు. ఈ మెడికల్ క్యాంప్ కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంటుందని, వీరంతా రొటేషన్ పద్ధతిలో హాజరవుతుంటారని నిర్వాహకులు తెలిపారు. ఆర్ధోపెడిక్, డయాబెటీక్, గైనకాలజీ, పీడీయాట్రిషన్ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు. పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. విజయవంతంగా ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ యెండూరి అభినందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ప్రసాద్ నల్లూరి కూడా కొంతమందికి వైద్య చికిత్స అందించడం విశేషం.

తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







