Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- October 07, 2024
వ్యవసాయ భూములు, చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకొని వచ్చిన మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్న మధ్యతరగతి వారి కోసం ఈ మెసేజ్ ఉపయోగపడుతుందని మా గల్ఫ్ ముఖ్య ఉద్దేశం.దయచేసి చివరి వరకు చదవండి.
ఒక వ్యక్తి ఇటీవల కాలంలో తనకున్న వ్యవసాయ భూమి/రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్ముకుంటే అతనికి వచ్చిన మొత్తం సుమారు 50 లక్షల రూపాయలు అనుకుందాం. ఈ మొత్తాన్ని Systematic Withdrawal Plan (SWP) లో 12% వడ్డీ రేటుతో 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 40,000 రూపాయలను విత్ డ్రా చేస్తే, చివరి సంవత్సరంలో అతనికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..? ఈ పూర్తి సమాచారం చదివితే దిమ్మతిరిగిపోయే ఆలోచనలు వస్తాయి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ముందుగా Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుండి ప్రతినెల మనకు కావలసినంత విత్ డ్రా చేసుకోవచ్చు. SWP ద్వారా ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తం విత్ డ్రా చేసుకోవడం ద్వారా పెట్టుబడి నుండి నిరంతర ఆదాయం పొందవచ్చు. ఇది ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో లేదా నిరంతర ఆదాయం అవసరమైనప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. SWP ద్వారా మీరు పెట్టుబడి చేసిన మొత్తం నుండి ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు.
మీరు 50 లక్షల రూపాయలను 12 శాతం వడ్డీ రేటు తో 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 40,000 రూపాయలను విత్ డ్రా చేస్తే, మొత్తం 20 సంవత్సరాల కాలంలో సుమారు 96 లక్షల రూపాయలు విత్ డ్రా చేసినట్లు అవుతుంది. ఇంకా 20 సంవత్సరాల తర్వాత 12% వడ్డీ రేటు ఆధారంగా మీకు సుమారు 1 కోటి 50 లక్షల రూపాయలు అదనంగా వస్తాయి.
అంటే మీకు మొత్తంగా వచ్చిన ఆదాయం విలువ.. 96 లక్షలు + 1 కోటి 50 లక్షలు = 2 కోట్ల 46 లక్షలు.
ఇది ఒక సాధారణ లెక్క. వాస్తవంగా, వడ్డీ రేటు, మార్కెట్ పరిస్థితులు మరియు ఇతర అంశాలు కూడా ఈ లెక్కలో ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మార్కెట్లో హై రిస్క్ తో కూడిన కొన్ని సంస్థలు 18% to 24% రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. రిస్కు తీసుకోకుండా పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే 8 నుంచి 10 శాతం రిటర్న్స్ ఆరోగ్యకరంగా ఉంటుంది.
మొదటి నెలలో 50 లక్షల రూపాయలకు 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో నెలకు 50 వేల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే మొదటి నెల ఆదాయం 50 లక్షల 50 వేల రూపాయలు. ఇందులో నుండి 40 వేల రూపాయలను విత్ డ్రా చేస్తే 50 లక్షల పదివేల రూపాయలు ఉంటాయి.
(50,000,00 X 12% IR p.a = 50,500,00-40,000=50,100,00/- )
రెండవ నెలలో 50 లక్షల పదివేల రూపాయలకు 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో 50 లక్షల 60 వేల వంద రూపాయలు (50,60,100/-) ఆదాయం వస్తుంది. ఇందులోనుండి 40,000 విత్ డ్రా చేస్తే 50 లక్షల 20 వేల వంద రూపాయలు ఉంటుంది.
(50,100,00 X 12% IR p.a = 50,60,100-40,000=50,201,00/- )
అంటే రెండు నెలల కాలంలో మనకు 80 వేల రూపాయల ఆదాయం రాగ అసలు మొత్తం 50 లక్షల 20వేల వంద రూపాయలు అలాగే ఉన్నాయి అంటే ఇక్కడ మన అసలు అలాగే ఉండి మనకు అఘనంగా 80 వేల రూపాయలు విత్ డ్రా చేసుకోగా 20,100 రూపాయలు అదనంగా ఉన్నాయి. ఇలా ప్రతి నెలలో మన అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. పూర్తి సమాచారం పిడిఎఫ్ లో ఉంది చదువుకోగలరు.
అంటే ఇక్కడ తెలిసి వచ్చిన విషయం ఏమిటంటే.. 50 లక్షల రూపాయలు సుమారు మన దగ్గర రెండు ఎకరాల భూమితో సమానం అనుకుంటే రెండు ఎకరాలకు సంవత్సరంలో ఒక క్రాప్ కి లక్ష రూపాయలు ఆదాయం రావడం జరగదు. లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది అనుకున్న రెండు క్రాప్ లకు రెండు లక్షల ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం వలన ఒక సంవత్సరానికి నాలుగు లక్షల 80 వేల ఆదాయం వస్తుంది. అలాగే మన ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది.
ప్రతి నెల 40 వేల రూపాయలు ఒక కుటుంబానికి ఆదాయం అంటే అది ఆ కుటుంబంలోని యజమాని యొక్క సంపాదనతో సమానం లేదా ఒక కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి వేతనంతో సమానం. ఆ నలభై వేల రూపాయలలో కుటుంబాన్ని పోషించుకోవచ్చు అలాగే మరికొంత మళ్ళి తిరిగి రీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ 50 లక్షల రూపాయలని మన ప్రాథమిక ఆస్తిగా భావిస్తే 20 సంవత్సరాల పాటు మనకు కాసుల వర్షం కురిపిస్తుంది జీవితం ఎలాంటి వడదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఇదే పెట్టుబడిని 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఊహించని ఆదాయం మీ సొంతం అవుతుంది. అదే పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ ఏమి ఉండదు.
ఇంకో విషయం భూములు అమ్ముకొని ఇన్వెస్ట్ చేయమని మా గల్ఫ్ ఉద్దేశం అసలు కాదు. ఏదైనా కారణాల చేత భూములు అమ్ముకొని వచ్చిన ఆ సొమ్ముని దుర్వినియోగపరచకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలియక అయోమయంలో ఉన్న వారికి మాత్రమే ఈ సలహా అని మా గల్ఫ్ మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ఎస్ డబ్ల్యూ పి ప్లాన్ గురించి పూర్తి సమాచారం కోసం మంచి ఎక్స్పర్ట్స్ ని సంప్రదిస్తే ఇంకా క్షుణ్ణంగా వివరిస్తారు. వారి అభిప్రాయం తీసుకోవడం మంచిది.
ఇది మా గల్ఫ్ అభిప్రాయం మాత్రమే ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని, మంచి చెడుని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టీమ్ఇండియాకు ICC బిగ్ షాక్..
- యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..
- జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!
- తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..