కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- October 07, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో రవాణా రంగాలతో పాటు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా 2050 నాటికి జీరో స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సహకారంతో భూ రవాణా ప్రాజెక్టులకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఒమన్ లాజిస్టిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ బుసైది వివరించారు. తేలికపాటి వాహనాలను పర్యావరణ అనుకూల వాహనాలతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
తాజా గణాంకాల ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం 1,500 వాహనాలకు చేరుకుందని, వివిధ గవర్నరేట్‌లలో ఛార్జింగ్ పాయింట్ల సంఖ్య 120 పాయింట్లకు చేరిందని ఆయన వివరించారు. భారీ వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు హైడ్రోజన్ శక్తి అత్యంత సరైన పరిష్కారం అని అల్ బుసైది చెప్పారు. భూ రవాణా రంగం నుండి వెలువడే ఉద్గారాలు అన్ని రంగాలలోని మొత్తం ఉద్గారాలలో 20 శాతం వరకు ఉంటాయన్నారు. ఒమన్ సుల్తానేట్‌లో ఉద్గారాలను తగ్గించే లక్ష్యాలను మూడు దశలుగా విభజించారని రవాణా రంగంలో 2030లో తగ్గింపు రేటు మొత్తం ఉద్గారాలలో 3 శాతానికి, 2040లో అదనంగా 34 శాతానికి, 2050 నాటికి 100 శాతానికి చేరుకుంటుందన్నారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా విమానాల కోసం స్థిరమైన ఇంధన ప్రాజెక్టులతో సహా వాయు రవాణాలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







