BNI ఇండియా డెలిగేషన్‌తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- October 07, 2024
మనామా: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(BNI) బహ్రెయిన్ గల్ఫ్ హోటల్‌లో హై-ప్రొఫైల్ బిజినెస్ కాంక్లేవ్ నిర్వహించింది. BNI ఇండియా నుండి 46 మంది భారతీయ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. క్రాస్ బార్డర్ వ్యాపార సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బహ్రెయిన్‌లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ బుఖమ్మస్, బహ్రెయిన్ కేరళీయ సమాజం అధ్యక్షుడు పి. రాధాకృష్ణన్ పిళ్లై, డైరెక్టర్ వరల్డ్ NRI కౌన్సిల్ బహ్రెయిన్ సుధీర్ తిరునిలత్ కూడా హాజరయ్యారు. భారత్-బహ్రెయిన్ వ్యాపారాల మధ్య పెరుగుతున్న సంబంధాలను భారత రాయబారి వివరించారు. ప్రపంచ భారతీయ పెట్టుబడులకు బహ్రెయిన్ లో ఉన్న అవకాశాలను వివరించారు. భారత్ నుండి 46 మంది వ్యాపార ప్రముఖులను తీసుకురావడం ద్వారా సరిహద్దుల గుండా నెట్‌వర్కింగ్ చేయడంలో BNI నిజమైన స్ఫూర్తిని తెలియజేస్తుందని BNI బహ్రెయిన్ జాతీయ డైరెక్టర్ శ్రీ అరుణోదయ్ గంగూలీ అన్నారు.
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార రిఫరల్ నెట్‌వర్కింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని 1985లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 330,000 మంది సభ్యులు 78 దేశాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







