ఒమన్-కొరియా చారిత్రక సహకారంపై పుస్తకం ఆవిష్కరణ..!!

- October 07, 2024 , by Maagulf
ఒమన్-కొరియా చారిత్రక సహకారంపై పుస్తకం ఆవిష్కరణ..!!

మస్కట్: సియోల్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం సహకారంతో నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ (NRAA) "ది సుల్తానేట్ ఆఫ్ ఒమన్: హిస్టారికల్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్ విత్ ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా" అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకాన్ని కొరియన్ రచయిత డాక్టర్ హీ సూ లీ రచించారు. పుస్తకం మొదటి ఎడిషన్ (అరబిక్, కొరియన్ భాషలలో) ఏడు అధ్యాయాలను కలిగి ఉంది. ఇది ఒమన్ సుల్తానేట్  వ్యూహాత్మక ప్రాముఖ్యతపై రచయిత కోణంలో ఆసక్తిని, కొరియా - ఒమన్ సుల్తానేట్ మధ్య సహకార ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.  రెండు దేశాల చారిత్రక, సాంస్కృతిక అంశాలతోపాటు సమకాలీన రాజకీయ, ఆర్థిక వాస్తవాలతో వాటిని అనుసంధానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com