కొండగట్టు అంజన్న భక్తులకు శుభవార్త...
- October 07, 2024
తెలంగాణ: తెలంగాణలోని కొండగట్టు ఆలయంలోని అంజనేయస్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో అంజన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. కొండగట్టు భక్తుల కోరిక మేరకు 100 గదుల నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్న భక్తుల గదుల కోసం కావలసిన స్థలాన్ని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. కొండగట్టు ఆలయానికి వస్తున్న వారి కోసం బస చేసేందుకు ఎటువంటి గదులు లేకపోవడంతో టీటీడీకి ఆలయం వద్ద గదుల నిర్మాణానికి భక్తులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మేరకు టీటీడీ 100 గదుల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది అని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం100 కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







