'IPF' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- October 07, 2024 , by Maagulf
\'IPF\' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దుబాయ్: ఎడారి దేశంలో తంగేడు వనం విరబూసింది.తెలంగాణ ఇంటింటా రంగురంగుల పూలతో జరుపుకోనే బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే దుబాయ్ లో ఇండియన్ పీపుల్స్ ఫారం ఆధ్వర్యంలో అల్ కూజ్ లోని అంబాసిడర్ స్కూల్ లో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మరియు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆడపడుచులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జితేంద్ర వైద్య, కుంభాల మహేందర్ రెడ్డి,దీపికా, వంశీ గౌడ్, శరత్ గౌడ్, పెనుకులా అశోక్, గోవర్ధన్ యాదవ్, అజయ్ దేశవెని, దశరథం అపూర్ద్రపాటి విజయవంతం చేసారు.

మ‌హిళ‌లు పూలతో బతుకమ్మలు పేర్చి భక్తి శ్రద్ధలతో గౌరీ పూజ‌లు నిర్వ‌హించారు.మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటపాటతో దుబాయ్ న‌గ‌రం పుల‌కించింది.ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లు మార్మోగాయి.

ఈ సంద‌ర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలంగాణ  ఆడ బిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ  గల్ఫ్‌ దేశంలో నివసిస్తున్న మనవారంత ఒక కుటుంబంలా కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంద‌న్నారు. 

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండగ‌ని,ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే వుందని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటు వంటి కార్యక్రమాలు దానికి ఎంతో తోడ్ప‌డుతాయ‌ని చెప్పారు. 

పైడి రాకేష్ రెడ్డి  మాట్లాడుతూ... విదేశాల్లో స్థిర‌ప‌డ్డ ప్రవాస భార‌తీయులు...మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌ల‌మైన పునాదులు వేస్తున్నార‌ని అన్నారు.విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన,నాణ్యమైన  విద్యా, ఆధునిక సేవ‌లు వంటి వాటికి  పారిశ్రామిక‌వేత్త‌లు, ఎన్‌ఆర్‌ఐ లు చేయూత నివ్వాలని కోరారు.సామాజిక బాధ్య‌తగా పేద విద్యార్థుల‌కు విద్య‌నందించేందుకు త‌మ వంతు సాయం చేయాల‌ని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com