దుర్గ‌మ్మ ను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

- October 09, 2024 , by Maagulf
దుర్గ‌మ్మ ను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

అమరావతి: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు స్వాగతం పలికారు. సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లలో ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈరోజు టికెట్ దర్శనాలను నిలిపేసిన అధికారులు తెల్లవారుజాము నుంచి సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com