విడుదలకు రెడీ అయిన 'దానవీర శూరకర్ణ'
- July 06, 2015
స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం 'దానవీర శూరకర్ణ'. జె.వి.ఆర్ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బారాజు, చల సాని వెంకటేశ్వరరావు నిర్మాత. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.నిర్మాత మాట్లాడుతూ... 'బాల రామాయణం' తర్వాత అంతా బాలనటీనటుల తో వస్తున్న చిత్రమిది. దానవీర శూరకర్ణ ఓ దృశ్యం స్వర్గీయ జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు. వారితోపాటు మిగతా బాలనటులంతా కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు జెవిఆర్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. కౌస్య సంగీతం సారథ్యంలో పాటకు చక్కని స్పందన వస్తోంది. దానవీర శూరకర్ణ ఓ దృశ్యం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసినసెట్లు, గ్రాఫిక్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఇటీవ సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. జూలై చివరివారంలో లేదా ఆగస్ట్ మొదటివారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







