గ్రాండ్ మాస్క్, ఖతార్ లో డయాబెటిస్ క్యాoపులు
- July 06, 2015
మెర్స్క్ ఆయిల్, ఖతార్ వారి ఆర్ధిక సహాయంతో, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ మరియు ఖతార్ డైయాబెటిస్ అసోసియెషన్ వంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దోహా లోని గ్రాండ్ మాస్క్ లో శుక్రవార ప్రార్ధనలకు హాజరయ్యే భక్తులకు డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి 25 స్క్రీనింగ్ బూత్ లలో, శిక్షణ పొందిన నర్సులు మరియు ఎడ్యుకేటర్లతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా భక్తులు ఈ సేవలను వినియోగించుకున్నట్టు మెర్స్క్ ఆయిల్ ఖతార్ టెక్నికల్ లైయజన్ మానేజర్ అహ్మెద్ అల్-కువారి తెలిపారు. రమదాన్ సమయంలో డియాబెటిస్ ను గురించిన సమాచారం కోసం QDA హాట్ లైన్ 44547311 లేదా 55274919 లను ఉదయం8.30 నుండి మధ్యాన్నం 1.30 లోగా, వైద్య సలహాలు మరియు ఇతర సమాచారం కోసం HMC మరియు PHCC హాట్ లైన్ 55981331 ను సాయంత్రం 8.00 నుండి రాత్రి 11.00 వరకు కాల్ చేయవచునని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం, మరల జులై 10న ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







