టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా..

- October 11, 2024 , by Maagulf
టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా..

ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా ట్రస్ట్లను ఎవరు వారసులుగా ఉంటారని చర్చలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా నోయెల్ టాటాను ఎన్నుకున్నారు.

రతన్ టాటా సవతి తల్లి కుమారుడు నోయెల్ నావల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే ఏకగ్రీవంగా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. టాటా వారసత్వాన్ని అతనే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని భావించి అతన్ని ఎన్నుకున్నారు. నావల్ టాటా, సిమోన్ (రెండో భార్య) టాటాల కుమారుడే నోయెల్.ప్రస్తుతం నోయెల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ ఛైర్మన్గా ఉన్నారు.

అలాగే టాటా స్టీల్, టైటాన్ వైస్ చైర్మన్గా కూడా నోయెల్ టాటా ఉన్నారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కే ఎక్కువగా 66% వాటా ఉంది. దీనివల్ల టాటా ఛైర్మన్కు హోదాలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో నోయల్ టాటాకు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com