రవ్వ కొబ్బరి పాయాసం
- July 06, 2015
కావలిసిన పదార్ధాలు
గోధుమరవ్వ - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
కోవా - అర కప్పు
పాలు - అర లీటరు
యాలకులు - 4
జీడిపప్పు - సరిపడా
కిస్మిస్ - సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
ముందుగా ఒక బాణలి తీసుకుని దానిలో నెయ్యి వేసి గోధుమరవ్వను వేయించి పక్కన పెట్టాలి. దానిలోనే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక బాణలి తీసుకుని వేయించిన గోధుమ రవ్వ వేసి, దానిలో పచ్చి కొబ్బరితురుము కూడా వేసి బాగా వేయించి, దానిలో కోవా వేసి మరికొంచెం నెయ్యి వేసి బాగా వేయించి, దానిలో పాలుపోసి మరిగించాలి. పాలు గట్టిగా అవ్వనివ్వకుండా అవసరమైతే కొన్ని నీళ్లు పోసి మరిగించి, చివరిగా యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే గోధుమరవ్వ , కొబ్బరి పాయసం రెడీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







