టాలీవుడ్ బుట్ట బొమ్మ...!
- October 13, 2024
పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా మరపురాని హిట్స్ అందుకొని అగ్ర కథానాయకిగా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. నేడు టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు.
పూజా హెగ్డే పూర్తి పేరు పూజా మంజునాథ్ హెగ్డే 1990, అక్టోబర్ 13న ముంబై లో జన్మించింది. తల్లిదండ్రులది కర్ణాటకలోని ఉడుపి ప్రాంతం అయినా వృత్తిరీత్యా ముంబైలో సెటిల్ అయ్యారు. పూజా ఎంఎంకే కాలేజ్‌లో బీకామ్ పూర్తి చేసింది. పూజా 2010 మిస్ ఇండియా యూనివర్స్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది.
2012లో కోలీవుడ్ హీరో జీవా సరసన పూజా నటించిన తోలి చిత్రం మూగమూడి. ఈ చిత్రం తర్వాత 2014లో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. పూజా ను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలబెట్టింది మాత్రం అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథం" చిత్రం. ఈ చిత్ర విజయంతో పూజాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఐటెం సాంగ్ చేసి అలరించింది.
టాలీవుడ్ అగ్ర హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరింది. ఇదే బాలీవుడ్ చిత్రాల్లో అడపాదడపా నటిస్తూ హౌస్ ఫుల్ 4 వంటి హిట్ చిత్రంలో నటిచింది. కోలీవుడ్ లో హీరో విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించింది.ప్రస్తుతం బాలీవుడ్ అప్ కమింగ్ హీరోస్ మరియు కోలీవుడ్ హీరో విజయ్ 69వ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







