‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ ప్రముఖులు..

- October 13, 2024 , by Maagulf
‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ ప్రముఖులు..

హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ అధ్యక్షతన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేయడమే ‘అలయ్ బలయ్’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ దసరా, ఈ పర్వదినాన గుర్తొచ్చేది పాలపిట్ట, జమ్మి చెట్టు అని.. అలయ్ బలయ్ అంటే గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ అని రేవంత్ రెడ్డి అన్నారు.

బండారు దత్తాత్రేయ తెలంగాణ సంస్కృతిని కాపాడేలా కృషి చేస్తున్నారని, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన నుంచి వారసత్వంగా తీసుకొని విజయలక్ష్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అభినందించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ‘అలయ్ బలయ్’ స్ఫూర్తిగా పనిచేసిందని రేవంత్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com