దుబాయ్ లో 20% వరకు తగ్గిన స్కూల్ ప్రయాణ సమయం..!!
- October 14, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అనేక పాఠశాల ప్రయాణ సమయం 15 నుండి 20 శాతం వరకు తగ్గిందని చాలా మంది తల్లిదండ్రులు తెలిపారు. మొత్తం 37 పాఠశాలలను కవర్ చేస్తూ విస్తృతమైన రోడ్లను మెరుగుపరచడం దీనికి కారణమని వివరించారు. దుబాయ్ రోడ్లు రవాణా అథారిటీ (RTA) పాఠశాలలకు వెళ్లే వీధులను విస్తరించింది. సిబ్బంది, తల్లిదండ్రుల కోసం అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. పాఠశాల ఎంట్రీ,ఎగ్జిట్ వద్ద సమస్యలను పరిష్కరించారు. స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను ప్రవేశపెట్టారు. దీంతోపాటు విద్యార్థులను సురక్షితంగా పికప్, డ్రాప్ ఆఫ్ నిర్ధారించడానికి నిర్దిష్ట జోన్లను కేటాయించారు. సఫా బ్రిటిష్ స్కూల్ వద్ద పికప్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏర్పాట్లను ప్రాంతం కారణంగా 10-15 నిమిషాలు ఆదా చేసిందని బ్రిటీష్ నివాసితురాలు సారా రామ్ సే తెలిపారు. ఉమ్ సుఖీమ్ స్ట్రీట్‌లోని కింగ్స్ స్కూల్ దుబాయ్, ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ చౌయిఫాట్, హెస్సా స్ట్రీట్‌లోని దుబాయ్ కాలేజ్, అల్ సఫా స్కూల్స్ కాంప్లెక్స్, అల్ వార్కా 4లోని స్కూల్ ఆఫ్ రీసెర్చ్ సైన్స్, అల్ మిజార్ స్కూల్స్ కాంప్లెక్స్, నాద్ అల్ షెబా స్కూల్స్ కాంప్లెక్స్, అల్ తవార్ స్కూల్స్ కాంప్లెక్స్ 2, అల్ ఖుసైస్ స్కూల్స్ కాంప్లెక్స్‌తో సహా పలు కీలక ప్రాంతాలలో RTA డెవలప్మెంట్ పనులు ప్రయోజనం చేకూర్చాయని పలువురు నివాసితులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







