ఛార్జింగ్ రేట్లు సెట్..ఎలక్ట్రిక్ వాహనాలకు పెరిగిన డిమాండ్..!!
- October 14, 2024
యూఏఈ: యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ రేట్లను సెట్ చేశారు. దీంతో EVని కలిగి ఉండటం కొంచెం ఖరీదైనదిగా మారింది. అయినప్పటికీ, ఇది వినియోగదారుల డిమాండ్‌ను పెద్దగా ప్రభావితం చేయలేదు. రాబోయే సంవత్సరాల్లో EVలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చార్జింగ్ రేట్లను సెట్ చేయడం EVల డిమాండ్‌ను పెంచుతుందని అల్ హబ్టూర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరీమ్ మక్సూద్ అన్నారు. వినియోగదారులు ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని విభిన్న బ్రాండ్‌లు, వారికి అందుబాటులో ఉన్న ఎంపికలను పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఆగస్టులో యూఏఈ క్యాబినెట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ కోసం సవరించిన ధరలు ఇలా ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడర్లు 'ఎక్స్‌ప్రెస్' ఛార్జింగ్ సర్వీస్‌కు ప్రతి kWhకి కనిష్టంగా Dh1.20 ప్లస్ VAT, 'స్లో'కి సంబంధించి kWhకి కనీసం Dh0.70 వసూలు చేయాలని నిర్ణయించారు. యూఏఈ ప్రభుత్వం స్థిరమైన ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను ప్రోత్సహిస్తుంది. 2023లో 30,000 పైగా EVలు నమోదుకాగా, 2025 నాటికి ఈ సంఖ్య 100,000కి చేరుకోవచ్చని భావిస్తున్నారు. 2030 నాటికి మొత్తం వాహనాల కౌంట్‌లో 15 శాతానికి పైగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కలిగి ఉండాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలో భాగంగా EV ఛార్జింగ్‌ని ఫ్రాస్ట్రెంట్‌కి విస్తరించనున్నారు. 2030 నాటికి 10,000 స్టేషన్లు, 2027 నాటికి దుబాయ్ తన మొత్తం టాక్సీ ఫ్లీట్‌ను పర్యావరణ అనుకూల మోడల్‌లుగా మార్చడానికి సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







