ఒమన్ లో బెలారసియన్ పీఎం.. నేషనల్ మ్యూజియం సందర్శన..!!

- October 15, 2024 , by Maagulf
ఒమన్ లో బెలారసియన్ పీఎం.. నేషనల్ మ్యూజియం సందర్శన..!!

మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ ప్రధాన మంత్రి రోమన్ గోలోవ్చెంకో ఒమన్ సుల్తానేట్‌లో తన అధికారిక పర్యటనలో భాగంగా నేషనల్ మ్యూజియాన్ని సందర్శించారు.ఆయన వెంట ప్రతినిధి బృందం ఉంది. ఒమన్ సుల్తానేట్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే విషయాల గురించి అధికారులు వివరించారు. మారిటైమ్ హిస్టరీ హాల్‌లో ఒమానీ నౌకాదళం గురించిన వివరాలను, వాస్కోడగామా ఓడ శిధిలాల నుండి సేకరించిన భాగాలను పరిశీలించారు.  సివిలైజేషన్ అచీవ్‌మెంట్స్ హాల్, అఫ్లాజ్ హాల్, "గ్రేట్‌నెస్ ఆఫ్ ఇస్లాం" హాల్‌లను కూడా సందర్శించారు. "ది డియరెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఆఫ్ మెన్" అనే పెవిలియన్‌ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పెవిలియన్ దివంగత సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ బిన్ తైమూర్‌కు సంబంధించిన వస్తువులను పెట్టారు.  అనంతరం బెలారసియన్ ప్రధాని రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM)ని సందర్శించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com