అబుదాబిలో స్కూల్ బ్యాగ్ బరువు పరిమితి సవరణ..!!

- October 16, 2024 , by Maagulf
అబుదాబిలో స్కూల్ బ్యాగ్ బరువు పరిమితి సవరణ..!!

యూఏఈ: అబుదాబిలోని పాఠశాలలు త్వరలో విద్యార్థుల బ్యాక్‌ప్యాక్ బరువు వారి స్వంత బరువులో 5-10 శాతానికి మించకూడదు. ఈ మేరకు అబుదాబి విద్యా , నాలెడ్జ్ శాఖ స్కూల్ బ్యాగ్ బరువు నిబందనల్లో మార్పులు చేసింది. అమెరికన్ చిరోప్రాక్టిక్ అసోసియేషన్ సిఫార్సుల ఆధారంగా గ్రేడ్‌లలోని విద్యార్థులకు నిర్దిష్ట బరువు పరిమితులను నిర్ణయించారు.  స్టూడెంట్స్ వెన్నెముక లేదా శరీరంపై ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ చర్యలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 1, 2026 నుండి పాఠశాలలు ఈ విధానానికి అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు.

విద్యార్థుల గరిష్ట బ్యాక్‌ప్యాక్ బరువులు:

గ్రేడ్/ఇయర్ - గరిష్ట బ్యాక్‌ప్యాక్ బరువు

KG1/FS2 -2కిలోలకు మించకూడదు

KG2/ ఇయర్ -1 2kgలకు మించకూడదు

గ్రేడ్ 1/ ఇయర్ -2.2కిలోలకు మించకూడదు

గ్రేడ్ 2/ ఇయర్ 3 -3kg నుండి 4.5kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 3/ ఇయర్ 4 -3kg నుండి 4.5kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 4/ ఇయర్ 5 -3kg నుండి 4.5kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 5/ ఇయర్ 6 -6kg నుండి 8kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 6/ ఇయర్ 7 -6kg నుండి 8kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 7/ ఇయర్ 8 -6kg నుండి 8kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 8/ ఇయర్ 9 -6kg నుండి 8kgల మధ్య ఉండాలి

గ్రేడ్ 9/ ఇయర్ 10 -10కిలోలకు మించకూడదు

గ్రేడ్ 10/ ఇయర్ 11 -10కిలోలకు మించకూడదు

గ్రేడ్ 11/ ఇయర్ 12 -10కిలోలకు మించకూడదు

గ్రేడ్ 12/ ఇయర్ 13 -10కిలోలకు మించకూడదు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com