యూఏఈలోని పేరెంట్స్.. తమ పిల్లలపై వందలాది దిర్హామ్‌లను ఎలా ఆదా చేస్తున్నారంటే..!!
- October 16, 2024
యూఏఈ: యూఏఈలోని చాలా మంది పేరెంట్స్ పాఠ్యేతర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. వారి పిల్లలు సంగీతం, నృత్యం, భాషలు, క్రీడలు కూడా నేర్చుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. యూఏఈలో ఇటువంటి కార్యకలాపాల కోసం వ్యక్తిగతంగా తరగతులు నిర్వహించడం చాలా ఖరీదైన వ్యవహారం. తరచుగా ఒక్కో బిడ్డకు ప్రతి టర్మ్‌కి అనేక వేల దిర్హామ్‌లు ఖర్చవుతుంది. ఆన్లైన్ తరగతులు పిల్లలకు నేర్చుకునే స్వేచ్ఛను అందిస్తాయని, ఫిజికల్ కేంద్రాలకు డ్రాప్-ఆఫ్‌లు-పిక్-అప్ల ఇబ్బందులు తప్పుతాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.
భారత ప్రవాసి చయానికా బారుహ్ మాట్లాడుతూ.. “నా కుమార్తె ఇండోర్‌లో ఉన్న ఒక ఉపాధ్యాయుడి వద్ద రెండు సంవత్సరాలుగా సంగితం నేర్చుకుంటుంది. నేను నెలకు రూ.2,000 చెల్లిస్తాను. అది 100 దిర్హాం కంటే తక్కువ. నేను ఆమెను సంగీత పాఠశాలలో, ఆమె ప్రస్తుత పాఠశాలలో లేదా దుబాయ్‌లోని అకాడమీలో చేర్పిస్తే, నెలకు దాదాపు Dh500 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ’’ అని తెలిపారు.
అమెరికన్ ప్రవాసి నయీమా జకీ మాట్లాడుతూ.. “నా 7 సంవత్సరాల వయస్సు గల కొడుకు పాకిస్తాన్ నుండి ఖురాన్ తరగతులు నేర్చుకుంటాడు. 11 మరియు 12 సంవత్సరాల వయస్సు గల నా కుమార్తెలు ఈజిప్టు నుండి ఖురాన్ తరగతులు వింటారు. నేను ముగ్గురి పిల్లల కోసం నెలకు దాదాపు Dh1,500 చెల్లించేవాడిని. కానీ ఆన్ లైన్ తరగతుల వల్ల ఇప్పుడు దాదాపు ఖర్చు సగానికి తగ్గింది. ’’ అని పేర్కొన్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమీ ఎమిరేట్స్ హిల్స్ (DIA EH)లో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తల్లి దివిషా మోడీ మాట్లాడుతూ.. “కొన్ని సంవత్సరాల క్రితం, నా కొడుకు భారతదేశంలోని ప్రసిద్ధ అకాడమీ ద్వారా ఆన్లైన్లో చెస్ నేర్చుకుంటున్నాడు. మూడు నెలలకు Dh500 మాత్రమే చెల్లించాను. ఇది తరగతికి కేవలం Dh20 మాత్రమే. అదే యూఏఈలో మంచి చెస్ అకాడమీలో ఆన్-సైట్ క్లాస్‌లో నమోదు చేసుకోవడానికి ఒక్కో సెషన్‌కు Dh150 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ’’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







