అన్ లిమిటెడ్ అడ్వెంచర్..అక్టోబర్ 24 నుండి లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్..!!

- October 16, 2024 , by Maagulf
అన్ లిమిటెడ్ అడ్వెంచర్..అక్టోబర్ 24 నుండి లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్..!!

దోహా: ఎస్టిత్‌మార్ హోల్డింగ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్.. ఉత్తేజకరమైన వినోదాన్ని అందించే అడ్వెంచర్ కోరుకునే వారి కోసం మూడవ సీజన్‌తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. అల్ మహా ద్వీపం నడిబొడ్డున ఈ పార్క్ అక్టోబర్ 24న ప్రజల కోసం స్వాగతం పలుకనుంది. ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఎంట్రీ ప్యాకేజీలు, ఆశ్చర్యకరమైన కొత్త గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ సీజన్‌ మొదటి రోజు స్థానిక ఖతారీ కళాకారుడు నాసర్ అల్‌కుబైసీ, ప్రముఖ బహ్రెయిన్ గాయకుడు హలా అల్-టర్క్‌లచే ఆకట్టుకునే కాన్సర్ట్ ఏర్పాటు చేశారు.  అక్టోబరు 25న ప్రఖ్యాత అరబ్ సూపర్‌స్టార్ "అల్-షమీ" ప్రదర్శన ఉంటుంది.  అక్టోబర్ 26న లుసైల్ వింటర్ వండర్‌ల్యాండ్ కార్నివాల్ బహ్రెయిన్ హిప్ హాప్ ఆర్టిస్ట్/రాపర్ షో ఉంటుంది. అదేరోజు సాయంత్రం ప్రఖ్యాత ఖతార్ కళాకారిణి హమద్ అల్ ఖాజీనా అరబ్ సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు.  అదే విధంగా అక్టోబర్ 26న ప్రత్యేకంగా రూపొందించిన గౌర్మెట్ డెస్టినేషన్ “రఫీక్ విలేజ్” గ్రాండ్ లాంచ్ నిర్వహించనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com