నేడు వైసీపీ నేతలతో వైస్ జగన్‌ కీలక సమావేశం

- October 17, 2024 , by Maagulf
నేడు వైసీపీ నేతలతో వైస్ జగన్‌ కీలక సమావేశం

అమరావతి: వైసీపీ నేతలతో ఈరోజు వైస్ జగన్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానున్నారు. పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బూత్ లెవల్లో క్యాడర్‌ని చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకునే ఛాన్స్‌ ఉంది. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే, బూత్ లెవల్‌లో పార్టీ కేడార్‌ను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

అలాగే… భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు జగన్. త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షకు సిద్ధమైన జగన్.. ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జుల నియామకం చేశారు. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జుల నియామ కాలపై చర్చించే ఛాన్స్ ఉంది.

కాగా, చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. YCPలో చేరారు టీడీపీ బడా లీడర్‌. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com