ఎడతెరిపి లేని వానలకు తమిళనాడు విలవిల.. డ్రోన్లతో ఆహారం సరఫరా

- October 17, 2024 , by Maagulf
ఎడతెరిపి లేని వానలకు తమిళనాడు విలవిల.. డ్రోన్లతో ఆహారం సరఫరా

తమిళనాడు: తమిళనాడులోని పలు జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. తిరుపూర్‌లోని వీరపాండి, గాంధీనగర్, అంగేరిపాళ్యం, పాళంగేరి, నల్లూర్‌ తదితర ప్రాంతాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు బుధవారం రాస్తారోకో చేశారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విరమించుకున్నారు. వర్షపునీరు చేరిన ఇళ్లలోని ప్రజలను పక్కనే ఉన్న సామాజిక భవనాలకు తరలించారు. 

భారీ వర్షాలతో చెన్నైలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వనలు తగ్గకపోవడంతో వరదలు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వాహనాలను ఫ్లై ఓవర్‌ ల మీద పార్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే రెండువైపులా కార్లు బారులు తీరాయి. వరదలకు భయపడి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చాలామంది ఇలా వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. ఇదే పద్ధతిని చెన్నై వాసులు ఫాలో అవుతున్నారు. ఇక టూ వీలర్స్‌ ను యజమానులు తమ ప్లాట్‌లో పార్క్‌ చేసుకుంటున్నారు. 

చెన్నై నగరంలో సత్వర సహాయానికి అధికారులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందితో రంగంలోకి దిగారు. నేపథ్యంలో బోట్లు వెళ్లలేని ప్రాంతాల్లో బాధితులకు అత్యవసర వస్తువులను తరలింపునకు మహానగర చెన్నై కార్పొరేషన్‌ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు 3 డ్రోన్లు సిద్ధం చేసింది. వాటి ద్వారా పాలు, రొట్టె, మందులు తదితర సుమారు 5 నుంచి 10 కిలోల బరువున్న ఆహార పదార్థాలను తరలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com