యోగా సెలబ్రేషన్స్‌

- June 22, 2016 , by Maagulf
యోగా సెలబ్రేషన్స్‌


 
ఇండియన్‌ ఎంబసీ, బహ్రెయిన్‌ కేరళీయ సమాజం మరియు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ బహ్రెయిన్‌ చాప్టర్‌తో కలిసి 'యోగా ఫర్‌ హార్మొనీ అండ్‌ పీస్‌'ను నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 8.30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెగాయాలోని బికెఎస్‌ డిజె హాల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సార్‌లోని మియామీ పార్క్‌లో ఇండియణ్‌ అంబాసిడర్‌ అలోక్‌ కుమార్‌ సిన్హా సమక్షంలో ఇండియన్‌ లేడీస్‌ అసోసియేషన్‌ ఇంటర్నేషనల్‌ యోగా వేడుకల్ని నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటల నుండి 6.30 గంటల వరకు ఈ వేడుకలు జరుగుతాయి. హెన్సీ పరేఖ్‌, నీలాంజన, పల్లవి తదితరులు గెస్ట్‌ స్పీకర్లుగా వ్యవహరిస్తారు. అస్కర్‌లోని బ్రాంకో వర్కర్స్‌ క్యాంప్‌లో యూనిక్‌ యోగా సెషన్‌ని ప్లాన్‌ చేశారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇండియన్‌ అంబాసిడర్‌, అలాగే ఇండియన్‌ పార్లమెంటు సభ్యుడు శరద్‌ త్రిపాఠి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 500 మందికి పైగా కార్మికులు ఇందులో పార్టిసిపేట్‌ చెయ్యనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com