ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమిరేటీ యువకుల మృతి

- June 22, 2016 , by Maagulf
ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఎమిరేటీ యువకుల మృతి



ఇద్దరు ఎమిరేటి యువకులు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన రస్‌ అల్‌ ఖైమాలో జరిగింది. అజాన్‌ రోడ్‌లో ఓ కారు ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం అందినట్లు అల్‌ దిక్‌దాకా పోలీస్‌ స్టేషన్‌ ట్రాఫిక్‌ డైరెక్టర్‌ ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ ఇబ్రహీమ్‌ సైఫ్‌ అల్‌ మజ్రోయి చెప్పారు. వెంటనే, ప్రమాద స్థలానికి చేరుకున్నామని, ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడనీ, గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రమాద తీవ్రత కారణంగా కారులోని ముగ్గురు యువకులు బయటకు విసిరివేయబడ్డారు. డ్రైవర్‌ సీట్‌లో ఉన్న వ్యక్తికి లైసెన్స్‌ లేదని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించాలనీ, మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అల్‌ మజ్రోయి ఈ సందర్భంగా అప్పీల్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com