భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- October 18, 2024
యూఏఈ: భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మరింత మందికి ఆన్-అరైవల్ అందించనున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసిపి) ప్రకటించింది. ఇకపై యూకే, ఈయూ దేశాల పర్యాటక వీసాలు ఉన్న ఇండియన్స్ కు ఆన్ అరైవల్ వీసాలను అందించనున్నట్లు, ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికా పర్యాటక వీసాతోపాటు ఈయూ, యూకే దేశాల రెసిడెన్సీ ఉన్నవారికే ఆన్ అరైవల్ వీసాలను అందిస్తున్నారు.
యూఎస్, ఈయూ, యూకే వీసాలు, రెసిడెన్సీలు లేదా గ్రీన్ కార్డ్‌లను కలిగి ఉన్న భారతీయ పౌరులు వారి కుటుంబ సభ్యుల కోసం 14-రోజుల ప్రవేశ వీసా కోసం వీసా జారీ రుసుము Dh100గా నిర్ణయించారు. ఈ వీసాను అదనంగా 14 రోజులు పొడిగించడానికి రుసుము Dh250. 60 రోజుల వీసా 250 దిర్హాలు చెల్లించాలని ICP డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు. భారతీయ పౌరులకు ఆన్-అరైవల్ వీసాను విస్తరించడం యూఏఈ-ఇండియా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని అన్నారు. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడతోపాటు పెట్టుబడులు, ప్రతిభావంతులను ఆకర్షిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!







