విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!

- October 18, 2024 , by Maagulf
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!

మనామా: బహ్రెయిన్‌లో విద్యార్థుల ట్రాన్స్ పోర్టుకు సంబంధించి 323 లైసెన్స్ పొందిన వ్యక్తులు, సంస్థల జాబితాను బహ్రెయిన్ రవాణా,  టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో 259 పర్సనల్ డ్రైవర్లు, 64 కంపెనీలు ఉన్నాయి. విద్యార్థుల భద్రత, వారి హక్కులను పరిరక్షించడానికి లైసెన్స్ పొందిన ట్రాన్స్‌పోర్టర్‌లను ఎంచుకోవాలని మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులకు సూచించింది. సురక్షితమైన, విశ్వసనీయమైన సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు.  లైసెన్స్ లేని డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థి రవాణా సగటు ధర దూరాన్ని బట్టి నెలకు BD20 నుండి BD40 వరకు మాత్రమే వసూలు చేయాలని నిర్దేశించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com