అక్టోబర్ 21న దుబాయ్ వింటర్ క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- October 18, 2024
యూఏఈ: దుబాయ్ తాత్కాలిక వింటర్ క్యాంపింగ్ సీజన్ అక్టోబర్ 21న ప్రారంభమై ఏప్రిల్ 2025 చివరి వరకు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. అల్ అవీర్లో ఈ సీజన్లో తాత్కాలిక శిబిరాల కోసం, ప్రత్యేకమైన ఎడారి ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదించడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. క్యాంపింగ్ సీజన్ కనీసం మూడు నెలలు, గరిష్టంగా ఆరు వరకు అనుమతి ఉంటుంది. ఒక్కో క్యాంపుకు గరిష్టంగా 400sqm విస్తీర్ణంలో చదరపు మీటరుకు 44 ఫిల్స్ వీక్లీ పర్మిట్ ఫీజును నిర్ణయించారు. దుబాయ్ మునిసిపాలిటీ ప్రత్యేక వాణిజ్య జోన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ స్థానిక వ్యాపారాలు క్యాంపింగ్ సామాగ్రి, సంబంధిత సేవలను అందించడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పర్మిట్ హోల్డర్లు తమ శిబిరాలను కేటాయించిన స్థలంలో స్వంతంగా డిజైన్ చేసుకోవచ్చు. క్యాంపింగ్ ప్రదేశాలలో ఫైర్ వర్క్స్ పై నిషేధం విధించారు. అగ్నిమాపక యంత్రాలు తప్పనిసరి. క్యాంపింగ్ ప్రాంతంలో బైక్లకు 20కిమీ/గం వేగ పరిమితి. ఫ్లాష్ లైట్లు, లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించారు. దుబాయ్ మునిసిపాలిటీ వెబ్సైట్, దుబాయ్ నౌ యాప్, దుబాయ్ బిల్డింగ్ పర్మిట్ సిస్టమ్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







