బర్త్ డే స్పెషల్.! అందుకే కీర్తి సురేష్ మహా నటి.!

- October 18, 2024 , by Maagulf
బర్త్ డే స్పెషల్.! అందుకే కీర్తి సురేష్ మహా నటి.!

ఊరికే సూపర్ స్టార్స్ అయిపోరు. మహానటి కూడా అంతే. అంత ఈజీగా ఆ గౌరవాన్ని తన పేరుకు ముందు చేర్చుకోలేదు. ఆమెలో వున్న నటి గొప్పతనం అది. అదేనండీ మహానటి కీర్తి సురేష్ గురించి మాట్లాడుకుంటున్నాం.

ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌కి బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయ్. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు.

ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోగల టాలెంట్ కీర్తి సురేష్‌ది. అదే ఆమెను మహానటి హోదాలో నిలబెట్టింది. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కీర్తి సురేష్‌ని అవకాశాలు వరిస్తుంటాయ్.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ వున్నాయ్. తెలుగులో అంతంత మాత్రమే అవకాశాలున్నప్పటికీ తమిళంలో మాత్రం కీర్తి సురేష్ దూసుకెళ్తోంది.

ఆమె ప్రధాన పాత్రలో ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ వంటి సినిమాలు తెరకెక్కుతున్నయ్ అక్కడ. తెలుగులో ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్స్ అయ్యాకా కాస్త దూకుడు తగ్గించింది. అయినప్పటికీ కీర్తి కోసం కొన్ని పాత్రలు ఎప్పుడూ సిద్ధంగానే వుంటాయ్. ఆ పాత్రల్లో కేవలం కీర్తి సురేష్‌ని మాత్రమే మేకర్లు ఊహించుకుంటారు. అలాంటి అవకాశాలొస్తే.. కీర్తిని ఖచ్చితంగా దించుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com