18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ

- June 22, 2016 , by Maagulf
18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ

ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించిన 18 ఏళ్ల యువకుడిని ఎఫ్‌బీఐ(ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) అరెస్టు చేసింది. నిందితుడిని అక్రమ్‌ ముస్లెహ్‌గా అధికారులు గుర్తించారు. ఇండియానాపోలిస్‌ నుంచి న్యూయార్క్‌కు బస్సులో వెళ్తుండగా అధికారులు అరెస్టు చేశారు. అతను మొరాకో మీదుగా ప్రయాణించి ఐఎస్‌ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి వెళ్లడానికి ప్రణాళిక రచించుకున్నట్లు తెలిపారు. నిందితుడు ఐఎస్‌లో చేరి ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకే విదేశీ ప్రయాణం చేస్తున్నట్లు అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ జాన్‌ పీ కార్లిన్‌ తెలిపారు. .
తీవ్రవాద సంస్థకు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై న్యాయశాఖ చర్యలు తీసుకుంటోందని కార్లిన్‌ అన్నారు.
ఐఎస్‌ లాంటి ఉగ్రవాద సంస్థల వల్ల స్థానిక, విదేశాల్లో నివసించే అమెరికా పౌరులకు ముప్పు ఉందని వారిని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందని యూఎస్‌ అటార్నీ జోష్‌ మింక్లర్‌ తెలిపారు. అక్రమ్‌ దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష.. 2,50,000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com