స్పైస్‌జెట్‌ మాన్ సూన్ ఆఫర్ ...

- June 22, 2016 , by Maagulf
స్పైస్‌జెట్‌  మాన్ సూన్ ఆఫర్ ...

 ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌ ఆఫర్ ను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఐదు రోజుల తగ్గింపు బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. ఈ ఆఫర్ స్పైస్‌జెట్‌ నాన్ స్టాప్, దేశీయ విమానాలు ద్వారా జమ్మూ-శ్రీనగర్, అహ్మదాబాద్-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-అమృత్ సర్ మార్గాల్లో రూ 444 లు ఒక వైపు బేస్ ఛార్జీగా ఉంటుందని తెలిపింది.అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.
ఈ మాన్ సూన్ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొంది. స్పైస్‌జెట్‌ మొబైల్ యాప్ , స్పైస్‌జెట్‌.కామ్‌తోపాటు , ఇతర ట్రావెల్‌ పోర్టల్స్, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ తగ్గింపు ఆఫర్లు గ్రూప్ బుకింగ్స్ , శిశు బుకింగులకు వర్తించదని . ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com