ముహరక్ కార్మికులకు బహ్రెయిన్ గుడ్ న్యూస్..పునరావాసానికి ఆమోదం..!!

- October 19, 2024 , by Maagulf
ముహరక్ కార్మికులకు బహ్రెయిన్ గుడ్ న్యూస్..పునరావాసానికి ఆమోదం..!!

మానామా: వర్కర్స్ నైబర్‌హుడ్ అని కూడా పిలువబడే ముహరఖ్‌లోని బ్లాక్ 204ను పునరావాసం కల్పించడానికి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రారంభించిన ముహర్రక్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో దానిని కలపడానికి ప్రజాప్రతినిధుల సభ నుండి వచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బహ్రెయిన్ చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడానికి, ఇసా అల్ కబీర్ ప్యాలెస్ పునరుద్ధరణ, ముహరక్ అభివృద్ధి చొరవను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  "హిస్ రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నాయకత్వంలో కేబినెట్ నిర్ణయం అనుసరించి.. ముహరఖ్ అభివృద్ధి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 1.4 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళిక, అధ్యయనాలతో సహా దశలవారీగా అమలు చేయబడుతుంది.  భూసేకరణ, ప్రణాళిక, రూపకల్పన, సర్వేయింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన ఆర్థిక కేటాయింపులను పొందాయి. ”అని ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.  అక్టోబర్ 2023లో అత్యవసరంగా పార్లమెంటు ఆమోదించిన ఈ ప్రతిపాదనను ఎంపీలు మొహమ్మద్ అల్ అలావి, అబ్దుల్లా అల్ ధాన్, హిషామ్ అల్ అవధి,  హమద్ అల్ దోయ్, మాజీ ఎంపీ మహ్మద్ అల్ హుస్సేనీ  బృందం రూపొందించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com