పాలరాతి మిక్సర్ లో స్మగ్లింగ్.. టెక్నాలజీతో బయటపడ్డ భారీ స్కామ్..!!
- October 19, 2024
రియాద్: హలత్ అమ్మర్ సరిహద్దు ద్వారా వచ్చిన షిప్మెంట్లో దాచిన 1,225,200 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) విజయవంతంగా అడ్డుకుంది. పాలరాయి మిక్సర్‌ను తరలించే క్రమంలో దానిని అధునాతన టెక్నాలజీతో తనిఖీలు చేయగా.. పెద్దమొత్తంలో నిషేధిత మాత్రలు దొరికాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో షిప్ మెంట్ ను అందుకోవాల్సిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ డైరెక్టరేట్ కు రిఫర్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి సమాజాన్ని, జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో సహకరించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







