అబుదాబిలో హైవేపై కారును ఢీకొట్టిన ట్రక్..పోలీసుల హెచ్చరిక జారీ..!!
- October 19, 2024
అబుదాబి: అబుదాబిలో హైవేపై కారును ట్రక్ ఢీకొట్టింది. దీనికి రెండు వాహనాల డ్రైవేర్లే కారణమని, వారి నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఒక వాహనదారుడు పికప్ ట్రక్ నుండి పరుపు కింద పడటం చూసిన తర్వాత ఆపివేయగా, మరొకరు హైవేపై పడి ఉన్న స్టీల్ రాడ్లు రోడ్డు మీద పడటంతో గుర్తించిన తర్వాత ఆగిపోయాడు. దీంతో ప్రమాదం జరిగింది. అయితే, ఈ రెండు సందర్భాల్లో డ్రైవర్లు ప్రమాదాలను ముందే గ్రహించి, జాగ్రత్తగా ముందుకు కదిలితే క్రాష్‌లను నివారించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. రోడ్డు మధ్యలో ఆగితే ట్రాఫిక్ నేరం 1,000 దిర్హామ్ జరిమానా, ఆరు ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధిస్తామని ట్రాఫిక్, సెక్యూరిటీ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగ్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక