ఫుజైరా స్నూపీ ద్వీపం బీచ్ ఇప్పుడు సురక్షితం..!!
- October 19, 2024
యూఏఈ: ఎమిరేట్ తీరంలో ఉన్న స్నూపీ ద్వీపం బీచ్ ను తాకిన చమురు తెట్టును తొలగించారు. సందర్శకులు, అతిథులు ఈతకు వెళ్లడం ఇప్పుడు సురక్షితం అని అధికారులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో.. ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ క్లీన్-అప్ ఆపరేషన్‌కు ముందు, తరువాత బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అత్యవసర బృందం కాల్‌కు వేగంగా స్పందించి బీచ్ కు వెళ్లిందన్నారు. ప్రత్యేక చమురు స్పిల్ రెస్పాన్స్ కంపెనీలు, ప్రభావిత హోటళ్లు, ఇతర సంస్థలతో సమన్వయంతో అధికార యంత్రాంగం క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. నిందితులను గుర్తించే దిశగా కృషి చేస్తున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని కలిగించే వారిపట్ల ఎటువంటి ఉదాసీనత ఉండదని అథారిటీ తెలిపింది. ఏదైనా సమాచారాన్ని నివాసితులు ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ టోల్-ఫ్రీ నంబర్ 800368 ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







