సౌదీ అరేబియాలో స్పెషల్ సెర్చ్..వారంలో రోజుల్లో 21,971 మంది అరెస్ట్..!!
- October 20, 2024
రియాద్: సౌదీ అరేబియాలో చేపట్టి స్పెషల్ తనిఖీల్లో గత వారం రోజుల్లో మొత్తం 21,971 మంది అక్రమ నివాసితులను సౌదీ భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అక్టోబర్ 10 మరియు అక్టోబర్ 16 మధ్య కాలంలో ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో 13,186 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపారు. అదే సమయంలో 3,358 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్రమార్కులకు ఆశ్రయం కల్పించిన 18 మందిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు వివిధ దశలలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి సహాయం చేసే వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 నంబర్‌కు.. కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబర్‌లకు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







