వరల్డ్ సైట్ డే.. కంటి వ్యాధుల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..!!
- October 21, 2024
దోహా: ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (IAPB) ప్రారంభించిన ‘వరల్డ్ సైట్ డే’ని పురస్కరించుకొని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) అనేక కార్యక్రమాలను చేపడుతోంది.కంటి వ్యాధులను నివారించడం, అలాగే దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించడం, నిర్ధారణ చేయడంపై అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 బిలియన్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగవచ్చని, 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందిపై ప్రభావం చూపవచ్చని ఐఏపీబీ హెచ్చరించింది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందించడానికి నిరంతరం కృషి చేయడంలో ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ తెలిపారు. కంటి ఆరోగ్యం, సాధారణ కంటి వ్యాధులు, చికిత్స నివారణ పద్ధతులను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023లో ప్రకటించిన ఇటీవలి జాతీయ సర్వే ఫలితాల ప్రకారం.. 50 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో తీవ్రమైన దృష్టి లోపం లేదా అంధత్వంతో బాధపడుతున్న వారి శాతం గణనీయంగా తగ్గింది. 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 8.1% మంది దృష్టి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో 0.2% మంది తీవ్రమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అయితే అంధత్వంతో బాధపడుతున్న వారి శాతం 0.3% గా ఉంది. ఖతార్‌లో అంధత్వానికి ప్రధాన కారణాలను 33% డయాబెటిక్ రెటినోపతిగా సర్వేలో గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో 20% కంటిశుక్లం, 13% వద్ద గ్లాకోమా, 13% వద్ద రెటీనా వ్యాధులు, 6.7% లో సైట్ సంబంధిత లోపాలు ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 40% మందికి డయాబెటిక్ ఉందని, వీరిలో 38% మంది వ్యక్తులు గత రెండేళ్లలో ఎటువంటి పరీక్ష చేయించుకోలేదని నివేదికల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!