ఒమన్ లో భారతీయ వ్యాపారవేత్తకు ఘనంగా నివాళులు..!!

- October 21, 2024 , by Maagulf
ఒమన్ లో భారతీయ వ్యాపారవేత్తకు ఘనంగా నివాళులు..!!

మస్కట్: సుర్ మార్కెట్‌లో ఇంటి గోడ కూలిన ఘటనలో మరణించిన భారతీయ వ్యాపారవేత్త పురుషోత్తమ్ భాటియా(89), అతని భార్య పద్మిని(85)లకు ఘరంగా నివాళులు అర్పిస్తున్నారు.  ఈ జంట దశాబ్దాలుగా సూర్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికులు 'వాల్ద్ హేరా' అని ముద్దుగా పిలుచుకునే పురుషోత్తమ్‌.. ప్రముఖ హీరానంద్ కిషందాస్ అండ్ కంపెనీని నడుపుతున్నారు.  ఈ  ప్రసిద్ధ వస్త్ర దుకాణం గత 70 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది.  విషాద వార్త వైరల్ కావడంతో.. అతని  స్నేహితులు, బంధువులు, కస్టమర్లు ఆయన ఇంటి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే సుర్ పర్యటన సందర్భంగా ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ ఆయనను సత్కరించారు. పురుషోత్తంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com