ఏఐతో సత్వర న్యాయం.. యూఏఈలో తొలి వర్చువల్ లాయర్ ప్రాజెక్టు..!!
- October 21, 2024
యూఏఈ: GITEX 2024 సందర్భంగా న్యాయ మంత్రిత్వ శాఖ సాధారణ కేసుల్లో న్యాయపరమైన వాదనలను అభివృద్ధి చేయడంలో చట్టపరమైన సంస్థలకు సహాయపడే 'వర్చువల్ లాయర్' ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. వర్చువల్ లాయర్ అనేది యూఏఈలో మొదటి ప్రాజెక్ట్. కేసు విచారణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. వర్చువల్ న్యాయవాది న్యాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన “యూనిఫైడ్ నేషనల్ లెజిస్లేటివ్ టెక్స్ట్స్ డేటాబేస్”ని ఉపయోగించి వాదనలు వినిపిస్తుంది. అయితే దీనిని ఉపయోగించాలనుకునే న్యాయ సంస్థలు వర్చువల్ లాయర్‌ను మంత్రిత్వ శాఖలో నమోదు చేసిన తర్వాత దాని డేటాబేస్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతించనున్నారు. ట్రయల్ వెర్షన్ 2025లో ప్రారంభించబడుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది. మొదటి దశలో ఇది ఫీచర్లతో కూడిన సాధారణ కేసుల్లో న్యాయవాదులకు సహాయం చేయడానికి పరిమితం కానుంది. ముఖ్యంగా న్యాయమూర్తితో పరస్పర ఇంటరాక్షన్, వాయిస్‌ని టెక్స్ట్‌గా మార్చడం, మెమోరాండాలు, డాక్యుమెంట్స్ సమర్పించడం వంటి పనులకు పరిమితం చేయనున్నారు. ఇది డిజిటల్, ఇంటరాక్టివ్ లిటిగేషన్ వాతావరణంలో సేవలను వేగవంతం చేయడంతోపాటు అధునాతన సాంకేతికత, కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడానికి నిర్దేశించారు. యూఏఈ ప్రభుత్వంలోని ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్, ఆఫీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారని న్యాయ శాఖ మంత్రి అబ్దుల్లా సుల్తాన్ బిన్ అవద్ అల్ నుయిమి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కొత్త ఆవిష్కరణలు దోహదం చేస్తాయన్నారు. వర్చువల్ లాయర్ ప్రాజెక్ట్ న్యాయ వ్యవస్థపై పరిపాలనా భారాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ శాఖ సహాయ మంత్రి ఒమర్ సుల్తాన్ అల్ ఒలామా మాట్లాడుతూ.. వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు ద్వారా వేగవంతమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







