కేంద్ర హోంశాఖ కీలక భేటీ.. ఏపీ, తెలంగాణ అపరిష్కృత అంశాల పై చర్చ
- October 21, 2024
హైదరాబాద్: విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి మరో కీలక అడుగు పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లయినప్పటికీ, ఇంకా అనేక అంశాలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేస్తోంది.
ఈ క్రమంలో ఈ నెల 24న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ సమాచారమిచ్చింది.
ఈ సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు.. విద్యుత్, రహదారులు, ఉక్కు, వ్యవసాయం తదితర శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసి విభజన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ తాజాగా సమావేశం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!